ఎర్రమట్టి మంగమ్మ రికార్డు బద్దలు.. 75 ఏళ్ల వయసులో అమ్మాయికి జన్మనిచ్చిన రాజస్థాన్ బామ్మ!

  • ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం
  • ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన ‘అమ్మ’గా గుర్తింపు
  • తల్లీబిడ్డలు క్షేమం
74 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించిన ఏపీకి చెందిన ఎర్రమట్టి మంగమ్మ రికార్డు బద్దలైంది. రాజస్థాన్‌‌లోని కోటాకు చెందిన 75 ఏళ్ల బామ్మ అమ్మాయికి జన్మనిచ్చింది.

పిల్లలు లేని ఆమె ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చినట్టు కింకార్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బిడ్డ 600 గ్రాముల బరువుందని, ప్రస్తుతం నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో వైద్యుల పర్యవేక్షణలో ఉందని తెలిపారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, 75 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన ప్రపంచంలోనే తొలి వృద్ధురాలిగా ఈ బామ్మ రికార్డులకెక్కింది.
Go Back to Shorts
Rajasthan
oldest mother
ivf

More Telugu News